Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేటరూరల్:నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, పద్మభూషణ్ గుర్రం జాషువా జాతీయ ఉత్సవాల పురస్కారంలో భాగంగా మండలానికి చెందిన తండా నాగేందర్ ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డును అందుకున్నారు. ఆడపిల్లను బతకనిద్దాం - ఎదగనిద్దాం, భృణహత్యలు చేయడం నేరం అంటూ కడుపులో ఉన్న ఆడ పిండానికి మాటలు ఇచ్చి, అబార్షన్ చేసేటప్పుడు ఆ ఆడ పిండం పడే బాధని ఇతి వత్తంగా రాసి, కను పాపా షార్ట్ ఫిల్మ్‌కు ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించారు. దీనికి గాను హోప్ స్వచ్ఛంద సంస్థ ఆయనకు ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రముఖ సరస్వతి ఉపాసనలు దైవజ్ఞ శర్మ,ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్సార్ శర్మ, మల్కాజ్గిరి జడ్జి బూర్గుల మధుసూదన్, సినీ యాక్టర్ ఏ.కిరణ్, తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సంస్థ అధ్యక్షుడు ప్రకాష్ కుంట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల సంస్థ అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు, కళారత్న సభాధ్యక్షులు బిక్కి కృష్ణ, హోప్స్ స్వచ్ఛంద సేవా సమితి నాయకులు దైద వెంకన్న తదితరులు పాల్గొన్నారు.