Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోటకొండూర్
మూడు వ్యవసాయ రంగ చట్టాలను తీసుకువచ్చి దేశాన్ని, దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ చేతిలో పెట్టి రైతులు నామరూపాలు లేకుండా చేస్తున్నా కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కొల్లూరు రాజయ్య, పైళ్ల యాదిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సీపీిఐ కార్యాలయంలో మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దేశంలో మోడీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదని హెచ్చరించారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా నల్ల యుద్ధంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏదుల భాస్కర్ఱెడ్డి, కార్యవర్గ సభ్యులుగా సూర్యగాని వెంకన్న, బొబ్బల లక్ష్మారెడ్డి, మారబోయిన జహంగీర్, కట్కూరి ఆగయ్య, రాపాక నరసయ్య, పల్లె మదర్, పల్లపు శ్రీనివాస్‌రెడ్డి, సింగిరెడ్డి దామోదర్‌రెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు బొల గాని సత్యనారాయణ, సింగిరెడ్డి దామోదర్ రెడ్డి, మండల కార్యదర్శి గాధ గాని మాణిక్యం, మండల సహాయ కార్యదర్శి ఆలేటి బాలరాజు, కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్న, బీరకాయల మల్లేష్, నర్సింలు, అంజయ్య, పి.రమేష్, జహంగీర్ తదితరులు పాల్గొన్నార