Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ
నవతెలంగాణ-చివ్వెంల
ఒక మహిళ గర్భం దాల్చింది మొదలు బిడ్డకు జన్మనిచ్చే వరకు అంగన్వాడీ సెంటర్ల ద్వారా పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యవంతమైన చిన్నారులను సమాజానికి అందించడంలో అంగన్వాడీల పాత్ర కీలకమని సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. మంగళవారం పట్టణంలోని జే ఫంక్షన్హాల్లో నిర్వహించిన పోషణ్ అభియాన్ అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడారు. గర్భిణులకు సామూ హిక సీమంతాలు, చిన్నారులకు అక్షరభ్యాసం నిర్వహించి మాట్లాడారు. ఒక మహిళ ఏదైనా బాధ్యత తీసుకొంటే దానిని పరిపూర్ణంగా పూర్తిచేస్తుందనేందుకు నిదర్శనం అంగన్వాడీ టీచర్లు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి జ్యోతిపద్మ, జెడ్పీటీసీ జీడీ భిక్షం, మామిడి అనిత, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడి కేంద్రాల టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.