Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని రాష్ట్ర పరిశీలన బందం సభ్యులు మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా అక్కడ అందిస్తున్న సేవలు, వసతులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై సిబ్బందిని, వైద్యులను అడిగి తెలుసు కున్నారు. అనంతరం అక్కడ ప్రజలతో అందుతున్న పథకాల గురించి ఆరా తీశారు.వీరి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రజని, మాతాశిశు విభాగం జిల్లా అధికారి జయా శ్యామ్‌సుందర్, జిల్లా అసంక్రమిత వ్యాధుల అధికారి కల్యాణ్‌చక్రవర్తి,డీసీహెచ్ఎస్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎన్హెచ్ఎం ఏఓ ఉమామహేశ్వరి, యమున, ఎన్హెచ్ఎం ఇన్చార్జి కిరణ్, క్వాలిటీ ఆఫీసర్ అరుణ, వైద్యులు విజరు, డాక్టర్ సురేష్, డాక్టర్ ఝాన్సీ, స్టాఫ్‌నర్సులు, హాస్పిటల్ సిబ్బంది, ఆరోగ్యకార్యకర్తలు, ఆశావర్కర్స్ పాల్గొన్నారు.