Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా సంక్షేమ అధికారిణి.జ్యోతిపద్మ
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
దేశవ్యాప్తంగా పోషణలోపం లేకుండా ఆరోగ్య భారత్-ఆరోగ్య తెలంగాణ అనే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పోషన్ అభియాన్ పథకంలో అంగన్వాడీ సేవలను విస్తృపర్చాలని జిల్లా సంక్షేమ అధికారి అధికారిణి జ్యోతి పద్మ అన్నారు. మంగళవారం పట్టణంలోని జే ఫంక్షన్హాల్లో పోషణమాసం కార్యక్రమాన్ని జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించి లబ్దిదారులకు మెరుగైన సేవలు అందించడానికి, పలు సూచనలు జారీ చేశారు.పెరుగుదల పర్యవేక్షణ కోసం అనుసరిస్తున్న విధానాల యొక్క నాణ్యతను పరిశీలించి పోషణలోపం లేకుండా ఉండాలన్నారు. పెరుగుదల పర్యవేక్షణపై ప్రత్యేకదష్టి సారించి వారి ఆరోగ్యస్థితిపై పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని తెలిపారు.ప్రస్తుతం 4వ రాష్ట్రీయ పోషన్ మV్‌ాలో భాగంగా అన్ని అంగన్వాడీ కేంద్రాలలో పోషణ మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.పెరుగుదల పర్యవేక్షణ, పెరటితోట పెంపకం, యోగా మెళ కువలు, రక్తహీనతలోపం ఈ నాలుగు అంశాలపై ప్రత్యేకదష్టి సారించి జనచైతన్యం తీసుకొచ్చి ఆరోగ్యభారత్ -ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తున్నా మన్నారు.అంగన్వాడీకేంద్రాలలో ఆధునిక పరికరాల ద్వారా పెరుగుదల పర్యవేక్షణ చేస్తూ పోషణ లోపం తీవ్రపోషణ లోపంతో బాధే పడేవారిని గుర్తించి అదనపు పోషకాహారం అందించడమే కాకుండా ఆరోగ్య శాఖ వారి సమన్వయంతో ఎన్ఆర్సీకి సిఫార్సు చేసి వారి ఆరోగ్యంపై ప్రత్యేకదృష్టి పెడుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓ కిరణ్మయి, పోషన్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ పి.సంపత్, సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జెడ్పీటీసీ జీడీ భిక్షం, మామిడి అనిత, వైస్‌ఎంపీపీ శ్రీనివాస నాయుడు పాల్గొన్నారు.