Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-అర్వపల్లి
నాటిన మొక్కల పెంపకంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని, పెరుగుతున్న ప్రతిమొక్క చుట్టూ రక్షణవలయాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి అన్నారు.మంగళవారం మండల కేందంలోని జాతీయరహదారిపై, జనగామ- సూర్యాపేట రహదారి వెంట ఉన్న మొక్కలను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలపెంపకంలో జాగ్రత్త వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.పంచాయతీ కార్య దర్శులు గ్రామంలో నాటి మొక్కలను సంరక్షించాలన్నారు.ప్రతి మనిషి మనుగడకు మెక్కలే జీవనాధారమన్నారు.చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటాలన్నారు.మండలంలోని తిమ్మాపురం, అడివెంల, జాజిరెడ్డిగూడెం, అర్వపల్లి, రామన్నగూడెం, బొల్లంపల్లి రహదారిపై ఇరువైపులా ఉన్న మొక్కలను పరిశీలించారు.ఆయన వెంట డీఆర్డీఓ పీడీ రాజు, ఎంపీఓ సురేష్, ఏపీఓ ప్రమీల, నగేష్, పంచాయతీ కార్యదర్శులు నాగయ్య, నాగరాజు, యాదమ్మ, దీపిక పాల్గొన్నారు.
మొక్కల పెంపకం సామాజిక బాధ్యత
తుంగతుర్తి : మొక్కలు నాటి వదిలేస్తే సరిపోదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ వినరు కష్ణారెడ్డి హెచ్చ రించారు.మంగళవారం మండలపరిధిలోని వెలుగుపల్లి, తుంగతుర్తి, కరివిరాల, కొత్తగూడెం గ్రామాలలో మల్టీ లెవెల్ అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించి మాట్లాడారు.మొక్కలకు పాదులు చేయుట,కంచె సరిచేయడం, ట్రీగార్డులను ప్రతిరోజూ తనిఖీ చేయాలని ఆదేశించారు.పల్లెప్రగతి కోసం ప్రతి రెండు నెలలకోసారి గ్రామసభలు నిర్వహించాలన్నారు.హరితహారంలో నాటిన మొక్కలు పెరిగేలా చూడాలన్నారు.లేనిపక్షంలో గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని రద్దు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, అడిషనల్ పీడీ సురేష్, ఏపీడీ రాజు, ఎంపీడీఓ లక్ష్మీ, ఎంపీఓ భీంసింగ్నాయక్, ఏపీవో వెంకన్న, పంచాయతీ కార్యదర్శులు మధు, ప్రశాంత్, దత్తు, నాగరాజు పాల్గొన్నారు.