Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
ఉపాధ్యాయవత్తిలో కొనసాగుతూ సామాజిక సేవాకార్యక్రమాలు చేసి నందుకు గుర్తింపుగా చల్లగుండ్ల సోమయ్యకు విద్యారత్న అవార్డును అందజేశారు.హైదరాబాదులోని రవీంద్రభారతిలో హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధుఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహి ంచిన గుర్రం జాషువా 126వ జయంతి ఉత్సవాల్లో వాగ్గేయ కారుడు, ఎమ్మెల్సీ గోరేటివెంకన్న చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మంగళ వారం మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉపాధ్యాయ యూనియన్ నాయకునిగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తూ సామాజిక సేవలైన రక్తదాన శిబిరం,కరోనా సమయంలో తిరుమలగిరి, సూర్యాపేట మున్సి పాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ, బడీడు పిల్లలను బడిలో చేర్పించడం, పేద పిల్లలకు ఆధార్‌కార్డు, మీ సేవాకేంద్రం ద్వారా సొంతఖర్చులతో ఇప్పించానన్నారు. తనకు ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని చెప్పారు.