Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరురూరల్ : ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి కాలుజారి గీత కార్మికుడు కిందపడడంతో తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం మండలంలోని కొల్లూరు గ్రామంలో చోటు చేసుకుంది.గీత కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం... కొల్లూరు గ్రామానికి చెందిన కోటగిరి మధుసూదన్ రోజువారి లాగానే తాటి చెట్టు ఎక్కి కల్లు గీయడానికి చెట్టుపైకి వెళ్లి కల్లు తీస్తున్న క్రమంలో పైనుండి కిందికి జారిపడ్డాడు.దీంతో మోకు కడుపులో గుచ్చుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి.తోటి గీత కార్మికులు ఆలేరు ప్రభుత్వాస్పత్రికిి తరలించారు.
ఆర్థికఅక్షరాస్యతపై అవగాహనా సదస్సు
చిట్యాల :మండల కేంద్రంలోని వట్టిమర్తి గ్రామ పంచాయతీలో మంగళవారం సీఎఫ్ఎల్ పేస్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అనే అంశం పై అవగాహనా సదస్సునిర్వహించారు. సీిఎఫ్ఎల్ నార్కట్ పల్లి క్లస్టర్ కో ఆర్డినేటర్ గణేష్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ గణేష్ , ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ మౌనిక ,ఉప సర్పంచ్ నరేష్ ,వార్డు సభ్యులు పాల్గొన్నారు.