Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోత్కూర్ :ఉమ్మడి నల్లగొండ- రంగారెడ్డి జిల్లా మదర్ డెయిరీ సహకార యూనియన్ లిమిటెడ్ నూతన డైరెక్టర్గా మండలంలోని పాటిమట్ల కు గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రచ్చ లక్ష్మీనర్సింహా రెడ్డి ఎన్నికయ్యారు. తుంగతుర్తి నియోజకవర్గ శాసన సభ్యులు డా. గాదరి కిశోర్ కుమార్ ఆశీస్సులతో ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన 305 ఓట్లకు గాను 219 ఓట్లు సాధించి డైరెక్టర్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మోత్కూర్ నాయకులు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి, మాజీ చైర్మెన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, టీిఆర్ఎస్ మండల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, డీసీసీబీ డైరెక్టర్, తుంగతుర్తి సహకార సంఘం చైర్మెన్ గుడిపాటి సైదులు, టిఆర్ఎస్ నాయకులు దాసరి తిరుమలేష్, అడ్డగుడూర్ మండల యువజన విభాగం అధ్యక్షులు లింగాల అశోక్ గౌడ్, మోత్కూర్, అడ్డగుడూర్ మండలాల గ్రామాల పాల సంఘాల చైర్మెన్లు, తదితరులు పాల్గొన్నారు.