Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
మోత్కూరు రైతు సేవా సహకార సంఘం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్, 500 మెట్రిక్ టన్నుల గోదాంల నిర్మించాలని తీర్మానించినట్టు ఆ సంఘం చైర్మెన్కంచర్ల అశోక్ రెడ్డి తెలిపారు. రైతు సేవా సహకార సంఘం 51వ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంప్లెక్స్ మొదటి అంతస్తులో సంఘం కార్యాలయం నిర్మించాలని, వాటి నిర్మాణ బాధ్యతను సంఘం చైర్మెన్, సీఈవోలకు అప్పగిస్తూ పాలకవర్గం తీర్మానం చేసిందన్నారు. సంఘంలో రైతులుతీసుకున్న దీర్ఘకాలిక రుణాలను స్వల్పకాలిక రుణాలుగా మార్చుకోవాలని, దీంతో రైతులకు పదిశాతం వడ్డీ తక్కువ అవుతుందని, స్వల్పకాలిక రుణాలకు రుణమాఫీ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. బైక్లోన్లను 50 నుంచి 250 మంది వరకు పెదాలని, చిరు వ్యాపారులకు ఇప్పటి వరకు ఇస్తున్న రూ.10 వేల లోన్లను ఇక నుంచి రూ.20 వేలకు పెంచి ఇవ్వనున్నట్టు తెలిపారు. సంఘం ద్వారా అరువుపై ఎరువులు తీసుకున్న రైతులు 180 రోజుల్లో డబ్బులు చెల్లించి తిరిగి మళ్లీ తీసుకోవచ్చని తెలిపారు. రైతులు పండించిన వరి పంటను ఎఫ్సీఐ కొనుగోలు చేయాలని తీర్మానించామన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిమేఘారెడ్డి, వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, సీసీబీ బ్యాంక్ మేనేజర్ మరిపెల్లి వీరయ్య, రైతుబంధు మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, సర్పయల ఫోరం మండలఅధ్యక్షుడు రాంపాక నాగయ్య, డైరెక్టర్లు పురుగుల మల్లయ్య, బయ్యని చంద్రశేఖర్, జిట్ట లక్ష్మయ్య, సామ పద్మారెడ్డి, దేవసరి రాములు, కారుపోతుల ముత్తయ్య, తాళ్లపల్లి స్వామి, బండ పద్మ, సర్పంచ్ తిరుమలేష్, రైతులు గజ్జి మల్లేష్, దబ్బెటి రమేష్, కిషన్ రెడ్డి, ఎం. నర్సిరెడ్డి, యాదయ్య రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.