Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వాగ్గేయకారులు కవి, రచయిత ,గాయకులు జయరాజు
నవతెలంగాణ - ఆలేరుటౌన్
సమాజనికి నాల్గవ స్తంభంలా నిత్యం ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా కొనసాగుతున్న జర్నలిస్టులు సమస్య ఏదైనా న్యాయం పక్షాన నిలబడుతూ సంపూర్ణ జర్నలిస్టులుగా ప్రజా సమస్యలపై నిరంతరం శోధించాలని వాగ్గేయకారులు, కవి, రచయిత గాయకులు జయరాజ్ అన్నారు. మంగళవారం ఆలేరు పట్టణకేంద్రంలోని ప్రకాశ్ గార్డెన్ ఆవరణలో టీడబ్ల్యూజేఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సమావేశం కొలుపుల వివేకానంద అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీపీ కె.నారాయణ రెడ్డి, ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య హాజరయ్యారు.టీడబ్ల్యూ జేఎఫ్ పతాకాన్ని రాష్ట్ర కార్యదర్శి బసవపున్నయ్య ఎగురవేశారు. అనంతరం సమావేశంలో ప్రజా వాగ్గేయకారులు జయరాజు మాట్లాడుతూ సమాజంలో అనేక రకాల రుగ్మతలను సమస్యలను వెలికితీస్తూ తన కుటుంబాన్ని సైతం పక్కనపెట్టి అర్ధాకలితో ప్రజా సేవ చేసే వారే జర్నలిస్టు అని ఆయన అన్నారు. సమస్య ఏదైనా దాని పరిష్కారం దిశగా పని చేయాలని సూచించారు. జర్నలిస్టులు ఐక్యతతో సమస్యల పరిష్కారానికి కలిసి ముందుకెళ్లాలని కోరారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య మాట్లాడుతూ తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతున్న సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అన్నారు.రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారన్నారు.ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మరింత ఉధతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు సీఐ నర్సయ్య, ఎస్ఐ ఇంద్రీస్ అలీ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు కొలుపుల అమరేందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మంగ నర్సింహులు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎంఎ. ఎక్బాల్ , విద్యార్థి, యువజన సంఘాల నాయకులు మంగ అరవింద్, చెన్నరాజేశ్, భువనగిరి గణేష్, సీనియర్ జర్నలిస్టులు మోరిగాడి మహేష్ , పెరబోయిన నరసింహులు, యేలుగల కుమారస్వామి ,ముత్యాల జలంధర్, దాసి శంకర్ ,ఎల్లంల వెంకటేష్ ,హన్మకొండ ఉపేంద్రాచారి ,వివిధ పార్టీలకు చెందిన మండల, పట్టణ కార్యదర్శులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.