Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ముషంపల్లిలో మహిళా కుటుంబాన్ని పరామర్శించిన మల్లు లక్ష్మి
నవతెలంగాణ- నల్లగొండ
నల్లగొండ మండలంలోని ముషంపల్లి గ్రామంలో లైంగిక దాడి, హత్యకు గురైన మహిళ కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఐద్వా రాష్ట్ర ప్రధానకార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ముషంపల్లిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు తెలంగాణ అనుకున్న రాష్ట్రం తాగుబోతుల తెలంగాణగా తయారైందని విమర్శించారు. మద్యం మత్తులో మహిళపై లైంగికదాడి, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, అధ్యక్షురాలు పోల బోయిన వరలక్ష్మి , రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, జిట్ట సరోజ ,నిమ్మల పద్మ ,జానకమ్మ ,టౌన్ కార్యదర్శి అరుణ కుమారి, అధ్యక్షురాలు కనుకుంట్ల ఉమారాణి ఉన్నారు.