Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ -కట్టంగూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలు ఉద్యమించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో వైవీఆర్ ఫంక్షన్ హాల్లో చెరుకు రామస్వామి ప్రాంగణంలో ,అంతటి రాములు నగర్లో ఆ పార్టీ 7వ మండల మహాసభ నిర్వహించారు. పార్టీ జెండాను సీనియర్ నాయకులు పున్న ఆగయ్య ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సభలో జూలకంటి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ కంపెనీలకు, బడాబాబులకు ఊడిగం చేస్తూ దేశ ప్రజల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రధాని మోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా బ్యాంకులో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంచాలన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని ప్రజలకు అందించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి, దళిత బందు ఇవ్వాలని కోరారు.ప్రతి కార్యకర్త ప్రజలను చైతన్యపరిచి సమస్యల పరిష్కారం కోసం ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. చిలుముల రామస్వామి, మూరారి మోహన్ , సైదమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్రకమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి,జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల, జిల్లా నాయకులు గంజి మురళి ,బొజ్జ చిన్న వెంకులు, మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, మండల కమిటీ సభ్యులు చిలుకూరు నర్సింహా, గద్దపాటి యాదగిరి, కక్కిరేణి రామస్వామి, జాలరమేష్, ఉట్కూరు యాదయ్య, కొండూరి సత్తయ్య, కట్ట భక్కయ్య,దుప్పెల్లి నాగయ్య, పందుల లింగయ్య, దండేంపల్లి శ్రీను, గార్ద సతీష్, గుడుగుంట్ల రామక్రిష్ణ పాల్గొన్నారు.