Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆత్మకూర్ఎం
ఈ నెల 7న మండల కేంద్రంలోని పీఎస్ గార్డెన్లో నిర్వహించనున్న సీపీఐ(ఎం) మండల మహాసభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం కోరారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ఆ పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి కార్యకర్త కషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ జిల్లా నాయకులు రచ్చ గోవర్ధన్; మండల కార్యదర్శి చెరుకు మల్లేష్, మండల నాయకులు వేములబిక్షం, రాచమల్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.