Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు దష్టి పెట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. గురువారం మండలంలోని మహమ్మదాబాద్ గ్రామ రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యామ్నాయ పంటల అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రైతులు రసాయనిక ఎరువులకు బదులు సేంద్రియ ఎరువుల ద్వారా పంటలను సాగు చేయాలన్నారు. రాగులు సజ్జలు జొన్నలు వంటి చిరుధాన్యాలను పండించాలన్నారు.ప్రత్యామ్నాయ పంటల వైపు మొదట చిన్న రైతులను ఆసక్తి పరచాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌కు అతి దగ్గరలో జిల్లా ఉన్నందున రైతులు వాణిజ్య పంటలను పండించడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారిణి అనురాధ, ఎంపీపీ గుత్త ఉమాదేవి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ పందుల శంకరయ్య, సర్పంచులు మల్లేపల్లి సునీత ప్రముఖ రెడ్డి, దోనూరు జైపాల్ రెడ్డి, మహిళా యాదవ రెడ్డి, పాండు రంగనాయక్, కట్టెల బిక్షపతి, తహసీల్దార్ ఆర్బి బ్రహ్మయ్య, ఎంపీడీవో యాదగిరి, వ్యవసాయ శాస్త్రవేత్త మధు శేఖర్‌రెడ్డి, వ్యవసాయాధికారి ఉమాదేవి, సింగిల్ విండో డైరెక్టర్ ముత్యాల అంజయ పలువురు ఏ ఈ ఓలు రైతు సమన్వయ సమితి సభ్యులు పాల్గొన్నారు.