Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ - నార్కట్‌పల్లి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రి అభివద్ధిపై గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి నేడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనతో పాటు దత్తాత్రేయ సమావేశానికి జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర వైద్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారని తెలిపారు. ఆధునీకరణకు చర్యలు, మెరుగైన సేవలు అందించే దిశగా వివిధ విభాగాల సిబ్బంది నియామకాలపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని తెలిపారు. బీబీనగర్ పూర్తిస్థాయిలో ఎయిమ్స్ అభివృద్ధి చెందితే ఢిల్లీ స్థాయి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఆధునీకరణ పనులకు సంబంధించి రూ.798 కోట్లకు టెండర్లు పిలిచినట్టు రెండు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవియను కలిసినప్పుడు తనతో చెప్పారని వెల్లడించారు. అదనంగా మరో 40 కోట్లు చెల్లించాలని కోరినట్టు చెప్పారు. 52 కిలోమీటర్ల నిడివి గల చిట్యాల, భువనగిరి రాష్ట్ర రహదారి విస్తరించి జాతీయ రహదారి పరిధిలోకి తేవాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీని కలిసి కోరామన్నారు. అంతకుముందు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో నకిరేకల్. మునుగోడు నియోజకవర్గాల్లో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో రోడ్లు భవనాల మరమ్మతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉష య్య గౌడ్ అమ్మనబోలు ఎంపీటీసీ కొంపల్లి సైదులు ఎల్లారెడ్డిగూడెం ఉపసర్పంచ్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.