Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి
గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మదర్‌డెయిరీకి మంచి పేరు ఉందని, సంస్థ మరింత పురోగతిలోకి సాధించాల్సిఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మదర్ డెయిరీ నార్ముల్ నూతన పాలకవర్గ పదవీ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. నార్ముల్ నూతన చైర్మెన్‌గా గంగుల కష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మాజీ చైర్మెన్ గుత్తా జితేందర్ రెడ్డికి వీడ్కోలు పలికారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి అభివద్ధికి ప్రభుత్వం చేయూత నందిస్తుందన్నారు. వ్యవసాయం అనుబంధం వత్తుల పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉందని ఉందన్నారు. సుదీర్ఘ కాలంగా చైర్మెన్‌గా విధులు నిర్వహించి నేడు వైదొలుగుతున్న గుత్తా జితేందర్ రెడ్డి సేవలు సంస్థ ఎప్పటికి మరచి పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ టెస్కాబ్ వైస్ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గాధరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి,శానంపూడి సైదిరెడ్డి, రవీంద్ర కుమార్,ఫైళ్ల శేఖర్ రెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. ఫైళ్ల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గుత్తాకు ఘనసన్మానం : నార్ముల్ చైర్మెన్ పదవి నుండి వైదొలిగిన గుత్తా జితేందర్ రెడ్డిని మంత్రి జగదీశ్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ యావత్ భారత దేశంలోనే మదర్ డెయిరీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చానన్నారు.
సంస్థను అభివద్ధి పరుస్తా
గంగుల కష్ణారెడ్డి
నార్ముల్‌ను మరింత అభివద్ధి పథంలోకి నడిపిస్తానని నార్ముల్ నూతన చైర్మెన్ గంగుల కష్ణారెడ్డి అన్నారు. చైర్మెన్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి తోడ్పాటు తో ముఖ్యమంత్రి కేసీఆర్ దిశా నిర్దేశం ప్రకారం పాడి అభివద్ధి చేయడంతో పాటు సంస్థ ను పురోగతి వైపు తీసుకెళ్తానన్నారు. నూతన కమిటీ ముఖ్యమంత్రి కెసిఆర్ ని ప్రగతి భవన్ వద్ద నూతన చైర్మన్ మంత్రులు డైరక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన పాలక వర్గాన్ని అభినందిస్తూ శాలువాతో సన్మానించారు