Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు , ఎంపీరేవంత్ రెడ్డి గురువారం ఆలేరు మండల కేంద్రం గుండా భూపాలపల్లి వెళ్తుండగా మార్గ మధ్యలో హైదరాబాద్ వరంగల్ 163 వ జాతీయ రహదారిపై టీపీసీసీ కార్యదర్శి జనగామ ఉపేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య ఆధ్వర్యంలో స్వాగతం పలికారు . గజమాల శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎజాజ్, మండల అధ్యక్షులు కొండ్రు రాజు వెంకటేశ్వరరాజు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిగిరి విద్యాసాగర్,సింగిల్ విండో డైరెక్టర్ కట్టే గొమ్మల సాగర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ నీలం వెంకట స్వామి, వల్లెపు ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.