Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చిట్యాల
16కిలోల గంజాయిని రైల్వేష్టేషన్ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు గురువారం పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఐ శంకర్ రెడ్డి విలేకర్లకు వివరాలు వెల్లడించారు. అదిలాబాద్‌కు చెంది. ఎండి.ఉస్మాన్ ఖాన్,అదే ప్రేమ్, ఎండి. షకీల్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుండి గంజాయి కొనుగోలు చేసి దానిని మహారాష్ట్ర , వివిధ ప్రాంతాల వారికీ అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. చిట్యాల రైల్వేక్రాస్రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారు. వారి నుండి 16 కేజీల గంజాయి , 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో ఎస్ఐ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.