Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే కూల్చివేసి ప్రజలను ప్రమాదాల నుండి కాపాడాలని సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి ఎండి.సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .గురువారం పట్టణంలో పాత బస్తీలో ఆ పార్టీ ఆధ్వర్యంలో సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాతబస్తీలోని మాధవ నగర్, హనుమాన్ నగర్, అంబేద్కర్ నగర్, శ్రీ కష్ణ నగర్ లైన్ వాడ, అక్కచెల్మ, శ్రీరామ్ నగర్ ,మాల్ బౌళి, ఫీల్ ఖానా ,తదితర ప్రాంతాల్లో వర్షాలకు శిథిలావస్థలో ఉన్న భవనాలు నాని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే అధికారులు గుర్తించి కూల్చివేసి ,డబుల్బెడ్రూంఇండ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. బస్తీలో డ్రైనేజీ, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. ఇనుప కరెంటు స్తంభాలను వెంటనే తొలగించి సిమెంట్ స్తంభాలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు పోలె సత్యనారాయణ,తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, భూతం అరుణ కుమారి, బండ మహేష్, నాగుల నంద కుమార్, వెంకన్న నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.