Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు
తుమ్మల వీరారెడ్డి
అ 8న సమ్మె
నవతెలంగాణ- నల్లగొండ
రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోను విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 8న నిర్వహించనున్న సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. గురువారం ఆన్లైన్లో ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఏండ్లుగా కనీస వేతనాలు పెంచడం లేదన్నారు. 2014- 2016 సంవత్సరాలలో కనీస వేతన సలహామండలి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపిన కూడా యాజమాన్యాల ప్రయోజనాల కోసం జీవోలను విడుదల చేయడం లేదన్నారు. ఐదేండ్లకోసారి వేతనాలు పెంచాలని ఉన్నా 15 ఏండ్లుగా పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచడం లేదన్నారు. కనీస వేతనం రూ.21వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మెలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ అధ్యక్షతన నిర్వమించిన ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బీకార్ మల్లేష్, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, నల్ల వెంకటయ్య, ఉపాధ్యక్షులు అవుత సైదులు, గౌతమ్ రెడ్డి,అద్దంకి నర్సింహ, పోలే సత్యనారాయణ, కానుగు లింగస్వామి, చిలుకూరి నరసింహ దాయానంద్, రామచంద్రు,సాగర్ల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.