Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ- భువనగిరిరూరల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న భారాలను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్, న్యూడెమోక్రసీ, కాంగ్రెస్, బీఎస్పీ, టీజేఎస్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ సాగు చట్టాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తుంటే ప్రాణాలను కాపాడేందుకు వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయడం లేదన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని విమర్శించారు. దేశంలోని బడా పెట్టుబడిదారులకు దేశసంపదను కట్టబెడుతోందన్నారు. కార్మిక నాలుగుకోడ్లను తెచ్చి కార్మికుల హక్కులను కాలరాసిందన్నారు. రాష్ట్రంలో టీిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిన ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. ధరణి ఫోర్టల్ లోపాలను సరిచేసి చర్యలు చేపట్టడం లేదన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షఁలు బీసుకుంట్ల సత్యనారాయణ, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, సీపీఐఎంల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాచకొండ జనార్దన్, సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి ఉప్పలయ్య, సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు ఏశాల అశోక్, వలిగొండ ఎంపీపీ నూతి రమేష్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, సీపీఐ జిల్లా కమిటీ సభ్యులు చెక్క వెంకటేష్, పీసీసీ మాజీ కార్యదర్శి తంగళ్ళపల్లి రవికుమార్,వివిధ పార్టీల నాయకులు మాటూరి బాలరాజ్ గౌడ్, బెజాడి కుమార్ , కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బర్రె జహంగీర్, ఆడవయ్య, సోమయ్య పాల్గొన్నారు.