Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ఈ ఏడాది పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లను పూర్తి చేయాలని యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో 2020-21 సంవత్సరానికి సంబంధించి రైతుల నుండి పత్తి కొనుగోలు చేసేందుకు మార్కెటింగ్, వ్యవసాయ, పోలీసు, ట్రాన్‌పోర్ట్, ఫైర్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులతో ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో 56,506 రైతుల నుండి లక్షా 24 వేలా 172 ఎకరాలలో 86 వేలా 141 మెట్రిక్ టన్నుల పత్తి రాబోతోందన్నారు. దీనికోసం భువనగిరి, చౌటుప్పల్, ఆలేర్, మోత్కూర్, వలిగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా వాటి పరిధిలో ఉన్న 16 కాటన్ జిన్నింగ్ మిల్లులకు కొనుగోలు కోసం సంబంధిత లైన్ డిపార్ట్మెంట్స్ సమన్వయంతో మూడు వారాల్లోగా యాక్షన్ ప్లాన్ పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేపట్టాలని, కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కూడా కేంద్రాలు నడపాలని సూచించారు. ఏఈఓ ల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మిల్లుల్లో కాటన్ ప్రొటక్షన్ కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్, ఫైర్ శాఖలు మిల్లులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్ సబిత, సీసీఐ కాటన్ పర్చేసింగ్ అధికారి కెవి. కష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ ఏడి నీలిమ, భువనగిరి ఏఎంసీి సెక్రెటరీ రంజిత్ రావు, పోలీసు, ఫైర్, ట్రాన్స్‌ఫోర్ట్ అధికారులు, జిన్నింగ్ మిల్లుల ఓనర్లు పాల్గొన్నారు.