Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మోతే
మండల కేంద్రంతో పాటు నాగయ్యగూడెం, తుమ్మలపల్లి గ్రామాల్లో డెంగ్యూ కేసులు నమోద య్యాయి. ఈ మేరకు ఆయా గ్రామాలను సెంట్రల్ టీం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా టీం సభ్యులు లక్ష్మణ్ మాట్లాడుతూ పాత టైర్లు, తాగి పడేసిన కొబ్బరి బోండాలను ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మెట్టు అలివేలునారాయణరెడ్డి, వీరస్వామి, రమేష్, టీం సభ్యులు శ్రీనివాస్, సూపర్వైజర్ కమలమ్మ, విజయలక్ష్మి, విష్ణు, సైదులు, నర్సయ్య పాల్గొన్నారు.