Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా భూమి నాకు కావాలి
అధికారం మీకుందని..మాకు అన్యాయం చేస్తారా
డబ్బున్న వాడిదే రాజ్యమా ?
రెవెన్యూ అధికారుల తీరుపై బాధితురాళ్ల ఆవేదన
నవతెలంగాణ - తిరుమలగిరిరూరల్
'కొత్త పాస్‌బుక్‌లు ఇవ్వమని అడిగితే.. గెంటేశారు..నా భూమి నాకు కావాలి..అధికారం మీదుందని...పేదోళ్లకు అన్యాయం చేస్తారా.. డబ్బున్న వాడిదే రాజ్యమా' అని మండల పరిధిలోని తొండ గ్రామానికి చెందిన మహంకాళి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ భూ వ్యవహారం గురించి మహంకాళి, లింగమ్మలు మాట్లాడుతూ తొండ శివారులోని సర్వే నెంబర్ 642, 639లో సుమారు ఆరెకరాల 27 గుంటల వ్యవసాయ భూమి బండారు సత్యమ్మ, ఆమె భర్త నర్సయ్యపై పట్టా పాస్ బుక్ కలిగి ఉందన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం 2018లో పాత బుక్‌ల స్థానంలో కొత్త పాస్వి జారీ చేసిందని, కానీ సత్యమ్మకు కొత్త పాస్ బుక్ ఇవ్వలేదన్నారు. దీంతో ఆమె ఇద్దరు కూతుర్లు అయిన మహంకాళి, లింగమ్మలు అప్పటి తహసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్‌కు కలిసి విన్నవించుకున్నారని, ఆయన ఈ విషయంపై ఆరా తీసే విషయంలో బదిలీ అయ్యారన్నారు. తర్వాత ప్రస్తుత తహసీల్దార్ సంతోష్ కిరణ్‌కు విన్నవించగా విషయం కోర్టులో ఉందని, పాసుబుక్ ఇవ్వడం కుదరదని చెప్పుకొచ్చారని చెప్పారు. విషయం కోర్డులో ఉంటే మూడు రోజుల క్రితం ఇదే తహసీల్దార్, ఆర్ఐ నరేష్‌లు బాధితులకు తెలియకుండా మా భూమి మీదకు వచ్చి మా పెదనాన్న కుమారులను భూమిని దున్నుకోమని ఎలా ప్రోత్సహించారని ప్రశ్నించారు. కోర్టు ఇలా చేయమని మీకు చెప్పిందా అని తహసీల్దార్‌ను ప్రశ్నించినట్టు తెలిపారు. కోర్టు పాస్ బుక్ ఇవ్వొద్దని ఏమైనా ఆర్డర్ ఉంటే తనకు చూపెట్టాలని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమి పట్టా ఉన్న మా అమ్మ సత్తమ్మ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా భూమి పట్టా లేకుండా మారిందో సమాధానం చెప్పాలని, ఈ విషయంపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తమ పెదనాన్న కుమారులైన బండారి నారాయణ, బండారి వెంకన్న, వారి కుమారులు మురళి, కిరణ్, వెంకన్న, అనిల్‌లు ఆర్థిక బలంతో తమ భూమిని కబ్జా చేయాలని, తమకు పాసుబుక్‌లు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు పాస్‌బుక్‌లు ఇప్పించాలని కోరారు.
దున్నమని ఎవరికి చెప్పలేదు
తహసీల్దార్ వివరణ
భూమిని దున్న మని ఎవరికీ చెప్ప లేదు. అది కోర్టు లో ఉన్న విషయం ఆమె కు వివరిం చాము. కోర్టు ఆదేశా లను ధిక్కరించి ఎలాంటి చర్యలూ తీసుకో లేమని వివరించాము. కోర్టు తీర్పు తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పాం.