Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అర్వపల్లి
పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఎంపీపీ మన్నె రేణుక, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్ అన్నారు. గురువారం స్థానిక స్త్రీ శిశుసంక్షేమశాఖ కార్యాలయంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ మహోత్సవంలో వారు మాట్లాడారు. గర్భిణులు సరైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్లు సునంద గౌసియాబేగం, అంగన్వాడీ టీచర్లు నవనీత, సునంద, శైలజ, వివిధ గ్రామాల సర్పంచులు, సీహెచ్వో చరణ్ పాల్గొన్నారు.