Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వేంల
మండల పరిధిలోని వట్టి ఖమ్మంపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం శిథిలావస్థకు చేరింది. భవనం పైకప్పు మొత్తం కూలిపోయే దశకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందోనని సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి రోజూ ఈ కేంద్రానికి పదుల సంఖ్యలో ప్రజలు హాజర వుతున్నారు. ఈ క్రమంలో భవనం పరిస్థితి చూసి వారూ భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
నూతన భవనం నిర్మించాలి
వీరబోయిన సైదులు - గ్రామస్తుడు, వట్టి ఖమ్మంపహాడ్
గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి. ఆస్పత్రికి వారం వారం చిన్న పిల్లలకు టీకాలు, గర్భిణులకు చికిత్స నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వారు ప్రమాదం బారిన పడకుండా ముందు జాగ్రత్తగా చర్యగా అధికారులు కొత్త భవనాన్ని నిర్మించాలి.