Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిలుకూరు :భార్యపై కత్తితో దాడి చేసిన సంఘటన శుక్రవారం మండలంలోని రామాపురం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రీలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ప్రాంతానికి చెందిన బజ్జురి అనిల ్కుమార్కు ఇచ్చి పదేండ్ల క్రితం వివాహం జరిపించారు. అనిల్‌కుమార్ కుటుంబ పోషణ కోసం పెయింటర్‌గా పని చేస్తున్నాడు. సంవత్సరం నుంచి భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలు సాగుతున్నాయి. ఈక్రమంలో శ్రీలక్ష్మి ఆరు నెలల క్రితం రామాపురం గ్రామంలో ఉన్న తన తల్లి గారి ఇంటికి వచ్చేసింది. రెండు రోజుల క్రితం భార్య వద్దకు వచ్చిన అనిల్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో భార్య శ్రీలక్ష్మి మెడపై దాడి చేశాడు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చేలోపు అనిల్ పారిపోయాడు. స్థానికులు, బంధువులు కలిసి ఆమెను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.