Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని రెండు రోజులుగా చేస్తున్న మిషన్‌భగీరథ కాంట్రాక్టు కార్మికులసమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి తెలిపారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ గురువారం రాత్రి సూపరింటెండెంట్ ఇంజనీర్ సురేష్‌కుమార్ సమక్షంలో కాంట్రాక్టర్ యూనియన్ నాయకులతో చర్చలు జరిగాయన్నారు.అక్టోబర్ 20 నాటికి పెండింగ్ వేతనాలు చెల్లిస్తామని, నూతన వేతనాల పెంపు కోసం అక్టోబర్ 20న జాయింట్మీటింగ్ ఏర్పాటు చేసి చర్చించు కుందామని తెలిపారు.దీంతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించామన్నారు. నూతన వేతనాల పెంపు జరగకపోతే మళ్లీ సమ్మె చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీ నారాయణ,సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్య దర్శులు కుడుతాల సైదులు, జంజారాల శ్రీనివాస్, నేలపట్లఅశోక్, ఉయ్యాల మురళి, వెంకన్న, కష్ణ, సత్యనారాయణ, నర్సి,ంహ, సైదులు పాల్గొన్నారు.