Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి
నవతెలంగాణ -ఆలేరుటౌన్
గత పాలకుల హయాంలో ఆలేరు పట్టణ అభివద్ధి శూన్యమని ఉమ్మడి నల్లగొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి నాయకత్వంలో పట్టణాభివద్ధికి ఇప్పటివరకు దాదాపు రూ.25 కోట్లఅభివద్ధి పనులు నిర్వహించినట్టు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పట్టణ విస్తత స్థాయి సమావేశం పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యిందని పంపకానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్య, వైద్యం, డిగ్రీ ,జూనియర్ కళాశాల, ఐటీఐ కళాశాలలో ఏర్పాటు, ప్రభుత్వ భవనాలు, గోదాంల నిర్మాణం, నూతన అగ్రికల్చర్ కార్యాలయం ,నిర్మాణం పట్టణంలో మండలంలో పక్కా రోడ్లు ,పట్టణంలో స్ట్రీట్లైట్లు నిర్మాణం పూర్తయిందన్నారు ,కుల సంఘాల భవనాల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణం, శ్మశానవాటికల నిర్మాణం, ఇతర అభివద్ధి పనులు అనేకం జరిగాయన్నారు. పట్టణంలో అభివద్ధి జరగలేదంటే తన డీసీసీబీ పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపక్షాలకు సవాలు విసిరారు .కేవలం కొద్ది మంది మాత్రమే అభివద్ధి జరగలేదంటూ తెల్లబట్టలేసుకుని రోడ్లపై తిరుగుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నారన్నారు .తప్పుడు ప్రచారాలు చేసే వారిని చూసి వెనుకాడేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్, మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య , టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ కుండే సంపత్, జిల్లా గ్రంధాలయా డైరెక్టర్ అడెపు బాలస్వామి, జిల్లా రవాణాశాఖ డైరెక్టర్ పంతం కష్ణ, కౌన్సిలర్లు ఎర్ర దాయమని, బెతి రాములు, రాయపురం నర్సింహులు, జూకంటి శ్రీకాంత్, నాయకులు జూకంటి శంకర్ వెంకటయ్య మైదం రంగయ్య ,ఆలేటి అనీల్, సీసా సత్తయ్య , మోరిగాడి వెంకటేష్, పట్టణ మహిళ అధ్యక్షురాలు సీసా మహేశ్వరి పాల్గొన్నారు.