Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిటౌన్
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఐకమత్యమే అంబేద్కర్ ఆలోచనా విధానమని బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నర్సింహస్వామి అన్నారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహంకు జ్ఞానమాలను (43వ వారం) సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారం దక్కాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐకమత్యం తోనే సాధ్యమన్నారు .ఎస్సీ ఎస్టీ లకు రిజర్వేషన్లు ప్రతిపాదన చేసినా, బీసీ లకు మాత్రం బీసీ కమిషన్ ద్వారా న్యాయం జరుగుతుందని భావించారని తెలిపారు. కానీ ప్రభుత్వాలు బీసీ కమిషన్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో అన్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఐకమత్యం తోనే రాజ్యాధికారం దక్కించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు,బ్యాంక్ ల జాతీయకరణ లో అంబేద్కర్ విశేషంగా కషి చేశారని, అందుకే అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా ప్రధానమంత్రి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జిల్లా చైర్మెన్ కొడారి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, సాధన సమితి జిల్లా నాయకులు సాల్వే రు ఉపేందర్, బొడ్డు కష్ణ, మహ్మద్ సలావుద్దీన్,వంగరి లక్ష్మీ నారాయణ, సాబన్కార్ వెంకటేష్,గాజల క్రాంతి కుమార్, ఓరుగంటి గోపాల్, ఉమ్మెత్తల మోహన్, దర్గాయి దేవేందర్, రావుల రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.