Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఉద్యోగులు కష్టపడి పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు ప్రఖ్యాతలు తీసుకు రావాలని, ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఇటీవలే నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆదివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి కార్యవర్గ సభ్యులు శాలువాలతో సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు తన ద్ర్రష్టికి తీసుకుని వస్తే వెంటనే పరిష్కారం చేయడానికి క్ర్రషి చేస్తానని చెప్పారు. ఉద్యోగులు అందరూ కష్టపడి పనిచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కేంద్ర సంఘం అధ్యక్షులుగా మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా రాయకంటి ప్రతాప్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో టీిఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జానిమియా, కార్యదర్శి దున్నా శ్యామ్, కోశాధికారి పి.అనం తరావు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఆకాష్వర్మ, ఉపాధ్యక్షులు శేఖర్, శ్రీనాధ్, కరుణశ్రీ, శివరాంరెడ్డి, పాశం అశోక్, వెంకటేశ్వర్లు, రమేష్, బాలునాయక్, రియాజ్, కల్యాణ్,శ్రవణ్ కుమార్, స్వామి శ్రీనివాస్ పాల్గొన్నారు.