Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రామన్నపేట
స్థానిక లేబర్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మామిడి వెంకట్ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గోరిగె సోములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిమాండ్స్ డే సందర్భంగా ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిర్మాణ రంగాన్ని రక్షించాలని, కేంద్ర ప్రభుత్వం పెన్షన్ స్కిం అమలు చేసే రాష్ట్రాలకు తన బడ్జెట్ నుండి నిధులు కేటాయించాలని, వలస కార్మికుల చట్టం 1979, నిర్మాణ కార్మికుల చట్టం కేంద్ర చట్టం 1996 సెస్సు చట్టం 1998 పునరుద్ధరించాలని, నిర్మాణంలో వాడే ముడిసరుకులపై జీఎస్టీ తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గాదె కష్ణ, మాజీ మండల అధ్యక్ష కార్యదర్శులు దుర్క నరసింహ, నోముల నారాయణ, పిట్టల శ్రీనివాసు, బెడద లచ్చయ్య, ఏబుషి బాషయ్య, చారీ తదితరులు పాల్గొన్నారు.