Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని గంగాపురం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పరిసరాల్లో పైప్ లైన్ లీకేజీలను అరికట్టాలని,పారిశుద్ధ్య కార్యక్రమాలను తక్షణమే చేపట్టాలని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పింగిలి విజరు రెడ్డిడిమాండ్ చేశారు.ఆదివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మురుగు గుంతల్లో దోమలు,ఈగలు స్థావరాలు ఏర్పాటు చేసుకోవటం వల్ల గ్రామంలో మలేరియా, డెంగ్యూ,కలరా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గం వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో గ్రామ శాఖ కార్యదర్శి గొల్లపల్లి సురేష్,సహాయ కార్యదర్శి ఎండి వజీర్,అల్వాల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.