Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సాగునీటిపారుదల ముఖ్యసలహాదారుడిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో నీటి విలువను తెలియజెసినజాజిరెడ్డి రామరాజు విద్యాసాగరరావుగారు చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు.ఆదివారం ఆయన మండలకేంద్రంలోని జాజిరెడ్డిగూడెం గ్రామంలో రామరాజు విద్యాసాగర్‌రావు మార్కెట్‌యార్డులో ఆయన విగ్రహా ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించారు.విద్యాసాగరరావు చేసిన సేవలను కొనియాడారు.అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా మండలపరిధిలోని కొమ్మాల గ్రామంలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన సీసీ రోడ్ల నిర్మాణపనులకు ప్రారంభోత్సవం నిర్వహించారు.అనంతరం ఆయన శ్రీ వేణుగోపాలస్వామి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు .ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు పూజార్లు ఘనంగా స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మన్నె రేణుక, జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్‌యాదవ్ ,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుండగాని సోమేష్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మెన్ కుంట్ల సురేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మొరిశెట్టి ఉపేందర్, మన్నె లక్ష్మీనర్సయ్యయాదవ్ పాల్గొన్నారు.