Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
వానకాలం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, సీనియర్ నాయకులు గూడూర్ అంజి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని కోదండరామిరెడ్డి భవనంలో నిర్వహించిన ఆ పార్టీ పట్టణ కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. అనేకమంది రైతులు పంటలు కోశారన్నారు. ధాన్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో, ఎక్కడ అమ్ముకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వారంలోపు ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాలను ప్రారంభించక పోతే రైతాంగాన్ని సమీకరించి పోరాటాలను ఉద్ధతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశానికి సామల సత్తి రెడ్డి అధ్యక్షత వహించగా పట్టణ కార్యదర్శి కొడే బాల్ నరసింహ,పగడాల శివ,బెత్ కమలమ్మ, బుగ్గ లక్ష్మయ్య , దుబ్బాక జగన్, రామస్వామి అనిల్ రెడ్డి , పోతగల్ల నర్సింహ తదితరులు పాల్గొన్నారు.