Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
యూపీలోని లఖీంపూర్ ఖేరి రైతు ఉద్యమ అమర వీరులను స్మరిస్తూ ఆదివారం రాత్రి జిల్లా కేంద్రంలో ఏఐఏడబ్ల్యూయూ, సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, యూటీఎఫ్, కేవీపీఎస్, కేఈకేఎస్, జీఎన్పీఎస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరిలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశీష్ మిశ్రా తన అనుచరులు, గుండాలతో కారుతో రైతులను తొక్కించి, తుపాకీతో కాల్పులు జరిపి నలుగురు రైతులను, పత్రికా విలేకరి చంపివేసిన దుర్మార్గ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య, ప్రజా సంఘాల నాయకులు మాటూరి బాలరాజు, దాసరి పాండు, సిర్పంగి స్వామి, వనం రాజు పాల్గొన్నారు.-