Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తహసీల్దార్ గణేశ్ నాయక్
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మహానీయుల విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అని, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిందని, చట్ట ప్రకారం అనుమతి తీసుకోవాలని తహసీల్దార్ డి.గణేశ్ నాయక్ సోమవారం నవ తెలంగాణకు తెలిపారు. మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 1026లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి వర్యులుగా పనిచేసిన స్వర్గీయ ఎలిమినేటి మాధవరెడ్డి పేరు మీద కేటాయించిన దాదపు 1 ఎకరం 20 గుంటల స్థలంలో తిరుమల ,తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం కోసం అనుమతులు ఇవ్వబడ్డాయన్నారు. కానీ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రభుత్వ సెలవుదినాలు శని, ఆదివారాలు చూసుకొని అక్రమించుకుంటున్నారన్నారు. శనివారం రాత్రికి రాత్రే ఆ స్థలంలో దిమ్మె ఏర్పాటు చేశారని, విషయం తమ దష్టికి రాగా అక్కడ ప్రభుత్వ స్థలమని హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేశామని తెలిపారు. హెచ్చరిక బోర్డును తొలగించి మరుసటి రోజు ఆదివారం రాత్రి మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. సోమవారం రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించినట్టు తెలిపారు. ఇతరులు ఆ స్థలంలోకి వెళ్లకుండా కంచె వేశామన్నారు. ఈ విషయంపై కలెక్టర్ పమేలా సత్పతికి నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు.హెచ్చరిక బోర్డును తొలగించి గుర్తు తెలియని వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.