Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పలువురి అరెస్టు
నవతెలంగాణ -నకిరేకల్
నకిరేకల్ కరోడ్గిరినాక దుకాణాలకు సోమవారం నిర్వహిస్తున్న బహిరంగ వేలం పాటను ప్రతిపక్ష పార్టీలు అడ్డుకున్నాయి. అడ్డుకోవడానికి దుకాణాదారులతో కలిసి వెల్తున్న ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి, టీడీపీ నియోజకవర్గ బాధ్యులు యాతాకుల అంజయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షుడు పల్స శ్రీనివాస్ గౌడ్ లతో పాటు 100 మంది దుకాణాదారులు,వివిధ పార్టీల నాయకులు,కార్యకర్తలను సి.ఐ.కీసరి నాగరాజు,ఎస్ఐ సైదాబాబుల ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు.ఉదయం 9 గంటలకే దీక్షా శిబిరం వద్దకు పోలీసులు వెళ్ళి ఆందోళనకారులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా నూనె వెంకట్ స్వామి ,యాతాకుల అంజయ్య పోలీసుల చర్యల్ని అడ్డుకుని ఊరేగింపుగా ప్రధాన సెంటర్ లో బైటాయించి నినాదాలు చేశారు.అక్కడే సభను నిర్వహించారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.11గ.కు వేలంపాటలను అడ్డుకోవడానికి వెల్తుండగా అరెస్ట్ చేశారు.