Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
యూపీలో రైతులమరణానికి కారణమైన కేంద్రమంత్రిని బర్తరఫ్ చేసి ఆయన కుమారుని పై హత్య కేసు నమోదు చేయాలని, ఘటనకు బాధ్యత వహిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వుత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక,రైతు,సీఐటీయూ జిల్లా నాయకులు నారి అయిలయ్య, బండ శ్రీశైలం, చిన్న పాక లక్ష్మీ నారాయణ మాట్లాడుతూనల్ల చట్టాలకు వ్యతిరేకంగా పదినెలలుగా ఉద్యమిస్తున్న రైతులపై కేంద్రంలోనూ, యూపీలోని బీజేపీ ప్రభుత్వాల నిరంకుశత్వం పరాకాష్టకు చేరిందన్నారు. ఇప్పటి వరకు లాఠీచార్జీ, జలఫిరంగులతో రైతులపై ఉక్కుపాదం మోపుతున్న బీజేపీ పాలకులు తాజాగా రైతుల ప్రాణాలు తీయడానికి బరితెగించిందన్నారు. యూపీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజరు మిశ్రా తనయుడు ఆశిష్ (సోను) మిశ్రా కాల్పులు జరిపి, ఆ పై కారుతో తొక్కించి నలుగురు అన్నదాతలను అమానుషంగా పొట్టన పెట్టుకున్నాడన్నారు. రైతులకు సంఘీభావంగా ప్రజలు ఎక్కడికక్కడ వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపినా కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. బీజేపీ ప్రభుత్వ ఫాసిస్టు చర్యకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జరిగే పోరాటాల్లో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, రైతు,వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు ఎండి.సలీమ్,సయ్యద్ హాశమ్,దండెంపల్లి సత్తయ్య పుఛ్చాకాయల నర్సిరెడ్డి, కుంభం కష్ణారెడ్డి, దండెంపల్లి సరోజ, పెంజర్ల సైదులు, నలపరాజు సైదులు, పోలె సత్యనారాయణ, మంజుల, రామకష్ణ, గానీపల్లి రాములు, రవీందర్ రెడ్డి శ్రీనివాస్ చారి, విష్ణు మూర్తి, కత్తుల ముత్తయ్య,గడ్డం రాములు,సాకే వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.