Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నూతనకల్
కుమారులు, కూతురులు లేకుండా వృద్ధాప్యంలో ఒంటరిగా ఉన్న వృద్ధులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామానికి చెందిన పిట్టల పాపయ్య(90) ఐరీస్ సమస్యతో ఆధార్‌కార్డు లేక వృద్ధాప్య పింఛన్ రాక ఇబ్బందులు పడుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆయన నివాసానికి వెళ్లి వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్థానిక తహసీల్దార్, ఎంపీడీవోలను పిలిచి పాపయ్య కండ్లు కనిపించకపోవడంతో వికలాంగుల పింఛన్, ఆయన భార్యకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఆదేశించారు. వారి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.50,000 ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం శ్రీమాత యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జెడ్పీటీసీ కందాల దామోదర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మండలాధ్యక్షుడు మున్న మల్లయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చూడి లింగారెడ్డి, ఎంపీటీసీ పన్నాల రమామల్లారెడ్డి, సర్పంచులు తీగల కరుణశ్రీ గిరిధర్‌రెడ్డి, కొంపల్లి రాంరెడ్డి, మాతంగి సోమ నర్సమ్మ, కొచ్చర్ల బాబు, ఎంపీడీవో ఇందిరా, తహసీల్దార్ జమీరొద్దీన్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సాయిలుగౌడ్, నాయకులు సైరెడ్డి సుధీర్‌రెడ్డి, పన్నాల సైదిరెడ్డి, ప్రశాంత్ రెడ్డి, చిరంజీవి పాల్గొన్నారు.