Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మఠంపల్లి
మండలంలోని గుర్రంబోడు తండాలో ఏర్పాటు చేయనున్న మెగా పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏ గ్రామ పంచాయతీలోనూ జరగని అభివృద్ధి గుర్రంబోడు తండాలో జరిగిందన్నారు. రూ.10 కోట్లతో లిఫ్టు, రూ.3 కోట్లతో చెక్ డ్యామ్, పైప్లైన్లు, రూ.50 లక్షలతో మెగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీడీ కిరణ్కుమార్, పెంటయ్య, తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీపీ మూడావతు పార్వతికొండానాయక్, జెడ్పీటీసీ జగన్ నాయక్, సర్పంచ్ పార్వతి, రామారావు, వైస్ ఎంపీపీ కవితకృష్ణ, మాజీ ఎంపీపీ కొండా నాయక్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఇరుగు పిచ్చయ్య, ప్రధాన కార్యదర్శి అశోక్నాయక్, కోలాహలం కృష్ణంరాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.