Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలగిరిరూరల్
బాలికల హక్కుల రక్షణ బాధ్యత అందరిదని ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.వేణు అన్నారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా సోమవారం మండల పరిధిలోని శ్రీ రాఘవేంద్ర జూనియర్ కళాశాలలో ప్యానల్ లాయర్లు, పారాలీగల్ వాలంటీర్లతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆజాద్ అమృతోత్సవంలో భాగంగా బాలికలు, మహిళలకు ఉచిత న్యాయం పొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. చట్టాల గురించి ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్లే అనేక రకాల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలిపారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేనప్పుడు కోర్టు వారే వారి వద్దకే వెళ్లి సాక్ష్యం సేకరించే విధంగా ఉంటుందన్నారు. పిల్లల హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదని, రాజీ మార్గమే రాజ మార్గమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డీడబ్ల్యూవో జ్యోతిపద్మ, సీడబ్ల్యుసీ చైర్మెన్ వెంకట్ రమణ, డీసీపీవో రవికుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జ్ఞాన్ సుందర్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ పాలబిందల వీరయ్య, న్యాయవాదులు వాలంటీర్లు పాల్గొన్నారు.