Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ - సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో జనవరి 2022 నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కర్నీ ఓటరుగా నమోదు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు అన్నారు. జిల్లా కలెక్టర్ సూచన మేరకు సోమవారం కలెక్టరేట్లో జిల్లాలో పోలింగ్ కేంద్రాల విభజన, పోలింగ్ కేంద్రాల పేర్ల మార్పు, పోలింగ్ కేంద్రాల ప్రదేశాల మార్పులపై జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌రావు మాట్లాడుతూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరూ ఎపిక్ కార్డ్, మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే విధంగా చూడాలని కోరారు. జిల్లాలో చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించుటకు బీఎల్వోలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీవో కిషోర్‌బాబు, హుజూర్నగర్ ఆర్డీవో వెంకారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఆర్.పాండురంగా, కె.కరుణాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు జి.నరేందర్‌నాయుడు, సీపీఐ(ఎం) నాయకులు కోటా గోపి, బీజేపీ నాయకులు ఎమ్‌డి.అబిద్, బీఎస్పీ నాయకులు మామిడి స్టాలిన్, తహశీల్దార్ వెంకన్న, ఎన్నికల పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.