Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరలొచ్చిన సీపీఐ(ఎం) కార్యకర్తలు, అభిమానులు
నవతెలంగాణ-మిర్యాలగూడ
సీపీఐ(ఎం) మండల నాయకులు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గొర్ల ఇంద్రారెడ్డి, ఆయన కుమారుడు భరత్‌రెడ్డి అంత్యక్రియలు సోమవారం పట్టణంలో అశ్రునయనాల నడుమ సాగాయి. మృతదేహాలను స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మృతదేహాలను సందర్శించి పార్టీ జెండాను ఉంచారు. ఇంద్రారెడ్డి మతదేహాన్ని ఉదయం 11 గంటలకు ప్రత్యేక వాహనంలో ఏరియాస్పత్రి వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. అక్కడ కొడుకు మృతదేహాన్ని అదే వాహనంలో ఉంచి ఇద్దరి మృతదేహా లను చైతన్య నగర్లో ఉన్న స్వగృహానికి తరలించారు. అక్కడి నుంచి సొంత గ్రామమైన తడకమల్లకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు...
ఇంద్రారెడ్డి, ఆయన కుమారుడు మృతదేహాలను చూసి నివాళులర్పించేందుకు మిర్యాలగూడ, తాళ్లగడ్డ యాద్గార్పల్లి, కాల్వపల్లి ఉట్లపల్లి, తక్కెళ్లపాడు గ్రామాలకు చెందిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
పలువురి సంతాపం..
గొర్ల ఇంద్రారెడ్డి, ఆయన కుమారుడు గొర్ల భరత్ రెడ్డిలను చివరిసారిగా చేసేందుకు సీపీఐ(ఎం) కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి స్థానికంగా ఉండి అంత్యక్రియలు పూర్తయ్యేవరకు అన్ని ఏర్పాట్లు చేశారు. పరామర్శించిన వారిలో పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, నాగిరెడ్డి, బండ శ్రీశైలం, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు లక్ష్మీనారాయణ, సయ్యద్ హాషం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్‌రెడ్డి, టీడీపీ నాయకులు కాసుల సత్యం, సీపీఐ(ఎం) నాయకులు నూకల జగదీష్ చంద్ర, రవినాయక్, డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, గాదె పద్మ, బాపట్ల పాండు, అయ్యుబ్, దేశిరామ్నాయక్, తిరుపతి, రామ్మూర్తి, నర్సిరెడ్డి, దామరచర్ల, వేములపల్లి మండలాల కార్యదర్శులు వినోద్‌నాయక్, పాదూరి శశిధర్‌రెడ్డి, వేములపల్లి వైస్ ఎంపీపీ గోవర్ధన్, నాయకులు పాపానాయక్, బాబునాయక్ పతని శ్రీనివాస్, కూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు నాగమణి, ఐలూ రాష్ట్ర కార్యదర్శి అనంతుల శంకరయ్య, కేవీపీఎస్ నాయకులు పరశురాములు, కౌన్సిలర్ నాగలక్ష్మిజలం ధర్ రెడ్డి, దేవేందర్‌రెడ్డి, జేవీవీ నాయకులు సుదర్శన్, ఊర్మిళ, పూలమ్మ, రామారావు, అడ్వకేట్ రవీందర్‌రెడ్డి, చౌగాని సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
గొర్ల ఇంద్రారెడ్డి, ఆయన కుమారుడు భరత్‌రెడ్డి మృతదేహాలను ఎమ్మెల్యే భాస్కర్‌రావు తనయుడు నల్లమోతు సిద్ధార్థ సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.