Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భువనగిరి రూరల్:జాతీయ తపాల వారోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులు రావినారాయణరెడ్డి స్మారకార్థం రూపొందించిన ప్రత్యేక పోస్టల్ కవర్ను హైదరాబాద్ పోస్టాఫీస్ హెడ్ క్వాటర్ పోస్ట్ మాస్టర్ జనరల్ టీఎం.శ్రీలత బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత దేశ వ్యాప్తంగా 44 మంది ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం భారత తపాలా ప్రత్యేక పోస్టల్ కవర్లను విడుదల చేసిందని తెలిపారు. రావి నారాయణరెడ్డి మనుమరాలు రవిప్రతిభారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల పేరిట ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఆర్.సత్యనారాయణ, బొల్లేపల్లి గ్రామ సర్పంచ్ బుచ్చిరెడ్డి, ఎంపీటీసీ చంద్రకళవీరస్వామి గౌడ్, టేకుల సోమారం తపాల సిబ్బంది పాల్గొన్నారు.