Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ - రామన్నపేట
కోవిడ్ సమయంలో పంచాయతీ కార్మికులు నిర్వహించిన పాత్ర అమోఘమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని బుధవారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి మాట్లాడారు. కరోనా మహమ్మారి కట్టడి కోసం గ్రామాల్లో కార్మికులు విస్తతమైన సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిబలరాం, జెడ్పీటీసీ పున్న లక్ష్మి జగన్మోహన్, తహసీల్దార్ వలిగొండ ఆంజనేయులు, ఎంపీడీవో జి.జలంధర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ నంద్యాల బిక్షంరెడ్డి, సర్పంచులు గోదాసు శిరీష పృద్విరాజ్, ఎడ్ల మహేందర్ రెడ్డి, అప్పం లక్ష్మీ నర్సు, గుత్త నరసింహారెడ్డి, రేఖ యాదయ్య, ముత్యాల సుజాత రవి, ఎంపీటీసీలు బడుగు రమేష్, గొరిగే నరసింహ, ఎండి రెహాన్, గాదె పారిజాత ముకుందం, ఎర్రోళ్ల లక్ష్మమ్మ నరసింహ, మండల కో ఆప్షన్ సభ్యులు ఆమేర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు మందడి ఉదరు రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోచబోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు.