Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
నవతెలంగాణ - భూదాన్‌పోచంపల్లి
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పలువురు లబ్దిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మీ, శాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని అభివృద్ధిని కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపెడుతుందని అన్నారు. అనంతరం తన సొంత నిధులతో పోచంపల్లి ప్రభుత్వాస్పత్రికి ఏర్పాటు చేసిన అంబులెన్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశం, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మెన్ లింగస్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు పాటి సుధాకర్‌రెడ్డి, ఎంపీడీవో బాల శంకర్, తహసీల్దార్ దశరధనాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.