Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు ఆటోలు.. మూడుసెల్ఫోన్లు రూ.38 వేల నగదు స్వాధీనం
నవతెలంగాణ-నార్కట్పల్లి
పొలాల్లో, ఖాళీ స్థలాల్లో ఆరు బయట ఉన్న వస్తువులను దొంగలించే దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. స్థానిక ఎస్ఐ భీమనబోయిన యాదయ్య అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.అమ్మనబోలు చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఏపీ 24 టీబి 7576 టాటా ఏసీ ఆటోలో ముగ్గురు ప్రయాణం చేస్తున్నారు.స్థానిక పోలీసులను చూసి వాహనాన్ని ఆపకుండా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకొని ఆటోను , ఆటో లో ప్రయాణం చేస్తున్న రామన్నపేట మండలం బాచుప్పల గ్రామానికి చెందిన దోమల రమేష్, శాలిగౌరారం మండలం ఆకారం గ్రామానికి చెందిన చీమలకష్ణ, రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన కళ్ళం యాదగిరిలను పోలీస్ స్టేషన్కు తరలించారు.విచారణలో ఈ నెల 10వ తేదీన మండలపరిధిలోని బాజకుంట గ్రామంలో ఎలుక మల్లయ్య కౌలు పొలంలో ఉన్న ఏడు క్వింటాళ్ల పత్తిని ముగ్గురు కలిసి అర్ధరాత్రి దొంగలించి చీమల కష్ణకు చెందిన ఏపీ 24 టీ వీ 75 76 నెంబర్ గల టాటా ఏసీ వాహనంలో చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో గల ప్రగతి పత్తి మిల్లు కు తరలిస్తుండగా సాంకేతికంగా లోపంతో ఆటో అగిపోయింది. దీంతో పాత ఇనుప సామను వ్యాపారం చేసుకునే కళ్ళం యాదగిరికి పత్తిలో వాటా ఇస్తామని ఆశ చూపి అతని ఆటో ఏపీ 36 %y% 3895 సహకారంతో పత్తి మిల్లుకు తరలించి రూ.38 వేలకు విక్రయించారు. ఆటోలో ప్రయాణిస్తున్న దోమల రమేష్ చీమల కష్ణ, కళ్లెం యాదగిరి దగ్గర రూ.38 వేల నగదు, మూడు సెల్ ఫోన్లు పత్తిని దొంగలించి అమ్మకానికి ఉపయోగించిన ఆటోలను పోలీసులు సీజ్ చేశారు.వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు.చాకచక్యంగా వ్యవహరించి ముఠాను పట్టుకున్న ట్రైనీ ఎస్సై నర్సింహను, పోలీస్సిబ్బందిని ఎస్సై అభినందించారు.