Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే నోములభగత్కుమార్
నవతెలంగాణ-గుర్రంపోడు
మత్స్యకార సొసైటీల అభివద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు.బుధవారం ఆయన మండలకేంద్రంలోని చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మిషన్ కాకతీయ పథకంతో రాష్ట్రంలోని చెరువులలో పూడికలు తీయించి తద్వారా చెరువులన్నింటిని నీటితో నింపి ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత చేప పిల్లలలను చెరువులలో వదలడం ద్వారా మత్స్యకార కుటుంబాల వారిని ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా కేసీఆర్ ప్రణాళికలు తయారు చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు మంచికంటివెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ ి గాలిసరిత రవికుమార్‌గౌడ్,టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గజ్జెల చెన్నారెడ్డి, వైస్‌ఎంపీపీ వజ్జ రామేశ్వరి ధనుంజయ, స్థానిక సర్పంచ్ మస్రత్ జహసయ్యద్మియా, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కంచర్ల శ్రీవాణిరెడ్డి,జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు వెలుగురవిముదిరాజ్, సొసైటీ చైర్మెన్ వెలుగుయాదయ్య, స్థానిక ఎంపీటీసీ కుప్ప రాములుగౌడ్, ఎంపీటీసీల ఫోరంమండల అధ్యక్షులు దోటిచంద్రమౌళి, పూల సత్యనారాయణ, సొసైటీ సభ్యులు వెలుగు వెంకటాద్రి, వెలుగుజలంధర్, వెలుగు నర్సింహ, సర్పంచులు రావులపాటిభాస్కర్, చాడ చక్రవర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.